Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం, సినిమా టిక్కెట్లు అమ్మడం ప్రభుత్వ బాధ్యత కాదు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్‌

గుంటూరు(విద్య), అక్టోబరు 13: మద్యం, సినిమా టిక్కెట్లు అమ్మడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ విద్యాసంస్థల్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమేనని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.మనోజ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని రద్దుచేయడంతోపాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. గుంటూరు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, బాపట్ల తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని  కోరారు.  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.కిరణ్‌, ఉపాధ్యక్షులు ఎం.బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement