Abn logo
Nov 29 2020 @ 00:51AM

మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌


అనకాపల్లి టౌన్‌, నవంబరు 28: ఎంతో మంది పేదలకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యనందిస్తున్న విజయనగరం మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌ డిమాండ్‌ చేశారు. దొడ్డిరామునాయుడు భవనంలో  శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కళాశాల ఉత్తరాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ఎక్కడా లేని సదుపాయాలు మహారాజాలో ఉన్నాయని పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement