‘పాక్‌లో సెక్సువల్ టెర్రరిజం వ్యాపిస్తోంది’

ABN , First Publish Date - 2021-09-08T00:35:54+05:30 IST

పాకిస్థాన్‌లో సెక్సువల్ టెర్రరిజం వ్యాపిస్తోందని ఓ పత్రికలో

‘పాక్‌లో సెక్సువల్ టెర్రరిజం వ్యాపిస్తోంది’

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సెక్సువల్ టెర్రరిజం వ్యాపిస్తోందని ఓ పత్రికలో నజీర్ అర్జియో రాసిన వ్యాసం పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవాలనాడు జరిగిన మినార్-ఈ-పాకిస్థాన్ విషాదం దేశానికి ఇబ్బందికరంగా మారడంతోపాటు లైంగిక దాడులకు పాల్పడేవారు, వారి మద్దతుదారులతో పాకిస్థానీ సమాజం  నిండిపోయినట్లు మరోసారి ధ్రువీకరించిందని పేర్కొంది. లైంగిక దురాగతాలకు పాల్పడటంలో పురుషులు అన్ని హద్దులను దాటిపోయారని, ప్రభుత్వం దీనిని గుడ్లు అప్పగించి చూస్తోందని పేర్కొంది. 


లైంగిక దాడుల వల్ల పడుతున్న మానసిక, సాంఘిక భారం చాలా తీవ్రంగా ఉందని ఈ వ్యాసం పేర్కొంది. మినార్-ఈ-పాకిస్థాన్ బాధితురాలు నిస్సహాయురాలు కావడం ఇటీవల జరిగిన సంఘటన మాత్రమేనని తెలిపింది. థట్టాలో 14 ఏళ్ళ బాలిక మృతదేహంపై అత్యాచారం జరిగిందని, ఖైర్‌పూర్‌లో పద్నాలుగేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారని, ఖజాన్‌లో మరో పద్నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం జరిగిందని తెలిపింది. దీనినిబట్టి పాకిస్థాన్‌లో సెక్సువల్ టెర్రరిజం వ్యాపిస్తోందని చెప్పవచ్చునని తెలిపింది. 


పాకిస్థానీ టిక్‌టాకర్ మహిళపై ఆగస్టు 14న లాహోర్‌లోని మినార్-ఈ-పాకిస్థాన్ వద్ద కిరాతక దాడి జరిగింది. వందలాది మంది ఆమెపై దాడి చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అనంతరం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలో లైంగిక నేరాలు పెరగడానికి కారణం మొబైల్ ఫోన్లను దుర్వినియోగపరచడమని ఆరోపించారు. 


Updated Date - 2021-09-08T00:35:54+05:30 IST