Abn logo
Sep 17 2021 @ 01:03AM

లైంగిక నేరాలు అనాగరికం

చైత్రకు కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్న జిరసం, ప్రజాసంఘాల నాయకులు


అనంతపురం టౌన, సెప్టెంబరు 16 : స మాజంలో లైంగిక నేరాలు కొనసాగు తుం డడం అనాగరికం, అమానవీయమని జిల్లా రచయితల సంఘం(జిరసం) నేతలు పేర్కొ న్నారు. చిన్నారి ఛైత్ర హత్యాచార ఘటనను నిరసిస్తూ జిరసం ఆధ్వ ర్యంలో గురువారం రాత్రి నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అ నం త రం చిన్నారి చైత్ర మృతికి సంతాపంగా కొవ్వొత్తు ల తో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో  ప్రజా గాయకుడు శేఖర్‌, జిరసం నాయకులు టీవీ రెడ్డి, కం బదూరి షేక్‌ నబీ రసూల్‌, కోటిగారి వన్నప్ప, మిద్దె ముర ళీకృష్ణ, కవులు అశోక్‌కుమార్‌, శేఖర్‌, ప్రజా సంఘాల నాయకులు ఉమామహేశ్వరి, సృజనదీప్తి, హసీనా, బాబీ, మస్తానప్ప, శ్రీనివా సులు, ప్రకాష్‌, బాబావలి తదితరులు పాల్గొన్నారు.