లైంగిక వేధింపులకు పాల్పడితే డిస్మిస్‌

ABN , First Publish Date - 2021-12-12T14:20:57+05:30 IST

బస్సుల్లో మహిళలపై లైంగికు వైధింపులకు పాల్పడే డ్రైవర్లు, కండక్టర్లను డిస్మిస్‌ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ హెచ్చరిం చింది. విల్లుపురం జిల్లా కోనూరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని రెండు రోజుల క్రితం విల్లుపురం నుంచి

లైంగిక వేధింపులకు పాల్పడితే డిస్మిస్‌

                      - డ్రైవర్లు, కండక్టర్లకు రవాణా శాఖ హెచ్చరిక


పెరంబూర్‌(చెన్నై): బస్సుల్లో మహిళలపై లైంగికు వైధింపులకు పాల్పడే డ్రైవర్లు, కండక్టర్లను డిస్మిస్‌ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ హెచ్చరిం చింది. విల్లుపురం జిల్లా కోనూరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని రెండు రోజుల క్రితం విల్లుపురం నుంచి కోథమంగళంకు బస్సులో వెళ్తుండగా ఆమెపై కండక్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బస్సు ఆపాలని యువతి కోరినా డ్రైవర్‌ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు సెల్‌ఫోన్‌లో తెలుపగా, బస్సు కొత్తమంగళం చేరుకున్న తర్వాత స్థానికుల సాయంతో కండక్టర్‌, డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఈ విషయమై బాధిత యువతి ఫిర్యాదుతో కడలూరు జిల్లా కుడిమి యాంకుప్పంకు చెందిన కండక్టర్‌ సిలంబరసన్‌ (32), అతనికి సహకరించిన విల్లుపురం సమీపం ఇరువేల్‌పట్టికి చెందిన డ్రైవర్‌ అన్బుసెల్వన్‌ (45) పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఇరువురిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ రవాణా శాఖ జనరల్‌ మేనేజర్‌ సెల్వన్‌ ఉత్తర్వులు జారీచేశారు. అంతేగాక ఈ వ్యవహారాన్ని రవాణాశాఖ సీరియస్‌గా తీసుకుంది. దీనిని అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - 2021-12-12T14:20:57+05:30 IST