Abn logo
Apr 13 2021 @ 01:32AM

వ్యభిచార గృహం నిర్వాహకురాలి అరెస్టు

గుడివాడ(రాజేంద్రనగర్‌) : గుడివాడ పట్టణంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను విటుడితో సహా పోలీసులు అరెస్టు చేశారు.  రూరల్‌ మండలం శేరీవేల్పూరుకు చెందిన మహిళ (33) ఇటీవల పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం గృహం నిర్వహిస్తోంది. పక్కా  సమాచారంతో డీఎస్పీ ఎన్‌.సత్యానందం ఆధ్వర్యంలో ఒన్‌టౌన్‌ సీఐ  కె గోవిందరాజు సిబ్బందితో సోమవారం దాడి చేశారు. విటుడు మహ్మద్‌ రహ్మతుల్లా,  వ్యభిచార గృహం నడుపుతున్న మహిళను అరెస్టు చేశారు. ఈ ముఠాకు వలలో చిక్కిన కాకినాడకు చెందిన యువతికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబానికి అప్పగిస్తున్నట్లు సీఐ  గోవిందరాజు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement