జల దిగ్బంధంలో మండాపొలం కాలనీ

ABN , First Publish Date - 2022-08-17T04:43:49+05:30 IST

టెక్కలి మేజర్‌ పంచాయతీలోని మండాపొలం కాలనీ మురుగు నీటి దిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో పది వీధులు ఉండగా.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. కాలువలను నిర్మించలేదు. ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షాలకు సైతం కాలనీ చిగురుటాకులా వణికిపోతుంది

జల దిగ్బంధంలో మండాపొలం కాలనీ
వీధుల్లో చేరిన మురుగు నీరు

వీధులను చుట్టుముట్టిన మురుగు నీరు

స్థానికుల బాధ వర్ణనాతీతం

 టెక్కలి రూరల్‌, ఆగస్టు 16: టెక్కలి మేజర్‌ పంచాయతీలోని మండాపొలం కాలనీ మురుగు నీటి దిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో పది వీధులు ఉండగా.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. కాలువలను నిర్మించలేదు. ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షాలకు సైతం కాలనీ చిగురుటాకులా వణికిపోతుంది. జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వీధులపై పడింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వరద నీరు బయటకు వెళ్లలేదు. దీనికి మురుగు నీరు తోడైంది. ప్రస్తుతం వీధుల్లో ఉన్న నీరు పచ్చగా మారింది. దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో నివాసితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పంచాయతీ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిష్కార మార్గం చూపించాలని కోరుతున్నారు. 







Updated Date - 2022-08-17T04:43:49+05:30 IST