మురుగే.. ఎరువు.. మార్కెట్‌లో కిలో రూ.10కే లభ్యం

ABN , First Publish Date - 2022-01-06T16:39:12+05:30 IST

మురుగులోని వ్యర్థాలు కూడా కాసులు కురిపిస్తు న్నాయి. సేంద్రియ వ్యవసాయానికి...

మురుగే.. ఎరువు.. మార్కెట్‌లో కిలో రూ.10కే  లభ్యం

  • ఎస్టీపీల నుంచి రోజుకు 15 టన్నుల వ్యర్థాలు
  • పోటీ పడి కొనుగోలు చేస్తున్న పలు కంపెనీలు
  • సిటీ కంపోస్టు పేరుతో అమ్మకాలు

హైదరాబాద్‌ సిటీ : మురుగులోని వ్యర్థాలు  కూడా కాసులు కురిపిస్తు న్నాయి. సేంద్రియ వ్యవసాయానికి ప్రధాన ఆధార మవుతున్నాయి. ఓ సంస్థ సిటీ కంపోస్టు పేరుతో కిలో ప్యాకెట్‌ను రూ.10 చొప్పున విక్రయిస్తోంది. గ్రేటర్‌లో సుమారు 25 సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్టీపీ)లు ఉన్నాయి. అందులో 22 ఎస్టీపీలను వాటర్‌బోర్డు నిర్వహిస్తోంది. వాటి నుంచి రోజూ 1950 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 772 మిలియన్‌ గ్యాలన్ల మురుగునీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో రోజూ సుమారు 15 మెట్రిక్‌టన్నుల వ్యర్థాలు ఎస్టీపీల వద్ద పేరుకుపోతున్నాయి. 


కొనుగోలుకు ఏజెన్సీల ఆసక్తి

వ్యర్థాల కొనుగోలుకు పలు ఏజెన్సీలు పోటీ పడుతున్నాయి. వాటర్‌బోర్డు ఇప్పటికే మూడు ఏజెన్సీలను ఎంపిక చేసి వాటికి విక్రయిస్తోంది. మెట్రిక్‌ టన్నుకు రూ.550 ధర నిర్ణయించగా, ప్రతీ నెలా రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఆదాయం వస్తోంది. వ్యర్థాల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.60 లక్షల ఆదాయం వాటర్‌బోర్డుకు సమకూరినట్లు తెలిసింది.


శుద్ధి చేసి.. కంపోస్టుగా మార్చి..

ఎస్టీపీల వద్ద సేకరించిన వ్యర్థాలను ఏజెన్సీలు శాస్ర్తీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్నాయి. ఈ వ్యర్థాల నుంచి ఇసుక, రాళ్లు, ప్లాస్టిక్‌ను వేరు చేసి భూసారాన్ని పెంచే వానపాములు ఇతరాత్రా వృద్ధి చెందేలా చేసి కంపోస్టు ఎరువుగా తయారు చేస్తున్నాయి. ఆ ఎరువును వ్యవసాయానికి అవసరమైనవారు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.


హ్యాండ్లూమ్‌ మార్చ్‌

కేంద్రప్రభుత్వం చేనేతపై పన్నును పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం పీపుల్స్‌ప్లాజా వద్ద హ్యాండ్లూమ్‌ మార్చ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు, ఎమ్మెల్సీ ఎల్‌ రమణతో పాటు, సినీనటి పూనం కౌర్‌ హాజరయ్యారు. ఆందోళనలో పాల్గొన్నారు. - ఖైరతాబాద్‌.

Updated Date - 2022-01-06T16:39:12+05:30 IST