పలు రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2021-07-25T05:41:10+05:30 IST

రాయపూర్‌ డివిజన్‌లో భద్రత సదుపాయాల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి ప్రకటించారు.

పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం, జూలై 24: రాయపూర్‌ డివిజన్‌లో భద్రత సదుపాయాల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి ప్రకటించారు. విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌-విశాఖ (వయా రాయగడ) మధ్య రాకపోకలు సాగించే 02857, 02856 నంబరు గల ప్రత్యేక రైళ్లను ఈ నెల 25 నుంచి ఆగస్టు మూడు వరకు, తిరుపతి-బిలాస్‌పూర్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే 07481, 07482 నంబరు గల ప్రత్యేక రైళ్లను ఈ నెల 29 నుంచి ఆగస్టు మూడు వరకు, విశాఖపట్నం-రాయపూర్‌-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 08528, 08527 నంబరు గల రైళ్లను ఆదివారం నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 


నేడు, రేపు రద్దు...రీ షెడ్యూల్‌


కంటకాపల్లి, కొత్తవలస, మల్లివీడు స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆది, సోమవారాల్లో పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. గుంటూరు-రాయగడ (07243) రైలును ఆదివారం రద్దు చేశారు.


సోమవారం రద్దయ్దిన రైళ్లు


విశాఖ-భువనేశ్వర్‌ (08570), భువనేశ్వర్‌-విశాఖ (08569), విశాఖ-రాయపూర్‌ (08528), రాయపూర్‌-విశాఖ (08527), రాయగడ-గుంటూరు (07244), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (07015)


ఆదివారం రీ షెడ్యూల్‌ చేసిన రైళ్లు


అలెప్పీ-ధనబాద్‌ (03352) ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 11.30 గంటలకు, ముంబై-భువనేశ్వర్‌ (01019) ప్రత్యేక రైలు సాయంత్రం 5.30 గంటలకు, గౌహతి-బెంగళూరు (02510) ప్రత్యేక రైలు ఉదయం 11.45 గంటలకు, డిబ్రుగర్‌-కన్యాకుమారి (05906) ఎక్స్‌ప్రెస్‌ అర్ధరాత్రి 12.25 (తెల్లవారితే సోమవారం) గంటలకు బయలుదేరే విధంగా రీషెడ్యూల్‌ చేశారు. కాగా సంబల్‌పూర్‌-నాందేడు (02085) ప్రత్యేక రైలు సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరే విధంగా రీ షెడ్యుల్‌ చేసారు.

Updated Date - 2021-07-25T05:41:10+05:30 IST