CBSE Grade 12 result: అబుధాబిలో సత్తా చాటిన ఇండియన్ స్కూల్స్!

ABN , First Publish Date - 2021-07-31T14:38:19+05:30 IST

తాజాగా విడుదలైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గ్రేడ్-12 పరీక్ష ఫలితాల్లో అబుధాబిలోని ఇండియన్ స్కూల్స్ సత్తా చాటాయి.

CBSE Grade 12 result: అబుధాబిలో సత్తా చాటిన ఇండియన్ స్కూల్స్!

అబుధాబి: తాజాగా విడుదలైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గ్రేడ్-12 పరీక్ష ఫలితాల్లో అబుధాబిలోని ఇండియన్ స్కూల్స్ సత్తా చాటాయి. చాలా స్కూల్స్‌ వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఆయా స్కూల్స్ తప ఫలితాల వివరాలను మీడియాతో పంచుకున్నాయి. వీటిలో మోడల్ స్కూల్ అబుధాబి చరిత్ర సృష్టించింది. గ్రేడ్-12లో మొత్తం 38 విద్యార్థులు ఉంటే అందరూ ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఐదుగురు 95 శాతం మార్కులు సాధించగా, మరో 10 మంది 90 శాతానికి పైగా మార్కులు సాంధించారు. ఈ స్కూల్ సగటు మార్కుల స్కోర్ 85.14 ఉండడం విశేషం. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ వీవీ అబ్దుల్ కదేర్ ఆనందం వ్యక్తం చేశారు. తమ విద్యార్థులు అద్భుతం చేశారని కొనియాడారు. 96.8 శాతం మార్కులతో దిల్జీత్ పీడీ అనే విద్యార్థి స్కూల్ టాపర్‌గా నిలిచాడు. 


అలాగే అబుధాబి ఇండియన్ స్కూల్ కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 290 మంది విద్యార్థుల్లో 95 మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. శ్రావణ్ క్రిష్ణ అనే విద్యార్థి 98.6 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. షైనింగ్ స్టార్ ఇంటర్నెషనల్ స్కూల్ సైతం వంద శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రిన్సిపాల్ అభిలాష సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తమ విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఈ స్కూల్ నుంచి హజ్‌రహా ఇమ్రాన్ 84.4 శాతం మార్కులతో టాప్ చేశాడు. అబుధాబిలోని మరో ఇండియన్ స్కూల్ మయూర్ కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. మొత్తం 37 మంది విద్యార్థులు ఉంటే అందరూ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. 96 శాతం మార్కులతో అయేషా బాను టాపర్‌గా నిలిచారు. 


Updated Date - 2021-07-31T14:38:19+05:30 IST