ఒడిశాలో దారుణం

ABN , First Publish Date - 2020-10-15T14:20:02+05:30 IST

తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల బాలికను పౌల్ట్రీఫాంలో బంధించి 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన...

ఒడిశాలో దారుణం

కోళ్లఫారంలో బాలికను బంధించి 22 రోజులుగా అత్యాచారం

కటక్ (ఒడిశా): తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల బాలికను పౌల్ట్రీఫాంలో బంధించి 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో వెలుగుచూసింది. జగత్ సింగ్ పూర్ జిల్లా తిర్టోల్ గ్రామానికి చెందిన టీనేజ్ బాలిక తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి పారి పోయింది. బాలికను ఇంటికి చేరుస్తానని చెప్పి పౌల్ట్రీ ఫాంకు తీసుకువెళ్లి బంధించి 22 రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పౌల్ట్రీ ఫాంపై దాడి చేసి బాలికను రక్షించారు. బాలికను మహిళా సదనానికి తరలించి నిందితుడిని అరెస్టు చశామని పోలీసులు చెప్పారు. 


ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 376(2), 376(2), సెక్షన్ 34ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.మహిళల భద్రత విషయంలో నవీన్ పట్నాయక్ సర్కారు విఫలమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి సమంతింఘర్ ఆరోపించారు. 

Updated Date - 2020-10-15T14:20:02+05:30 IST