Rescue operation: జాడ గల్లంతైన ఏడుగురు రోడ్డు నిర్మాణ కార్మికులను కాపాడిన ఐఏఎఫ్

ABN , First Publish Date - 2022-07-23T23:51:39+05:30 IST

అరుణాచల్‌ ప్రదేశ్-చైనా సరిహద్దుల సమీపంలోని మారుమూల కురుంగ్ కుమే జిల్లా‌ నుంచి..

Rescue operation: జాడ గల్లంతైన ఏడుగురు రోడ్డు నిర్మాణ కార్మికులను కాపాడిన ఐఏఎఫ్

ఇటానగర్: అరుణాచల్‌ ప్రదేశ్-చైనా సరిహద్దుల సమీపంలోని మారుమూల కురుంగ్ కుమే జిల్లా‌ నుంచి మూడు వారాల క్రితం జాడ తెలియకుండా పోయిన అసోంకు చెందిన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికుల బృందంలో ఏడుగురిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాపాడింది. ఐఏఎఫ్ హెలికాప్టర్లలో వీరిని సురక్షితంగా వెనక్కి తెచ్చారు. హురి సమీపంలోని డామన్ వద్ద శుక్రవారంనాడు వీరి జాడ తెలుసుకుని కాపాడినట్టు డామన్ సర్కిల్‌కు చెందిన బోర్టర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) తెలిపింది.


ఈద్ పండుగ కోసం అసోం వెళ్లాలని కార్మికులు అనుకున్నారని, అందుకు కాంట్రాక్టర్ నిరాకరించడంతో ఈనెల 5న వీరంతా క్యాంప్ నుంచి పరారయ్యారని తెలుస్తోంది. తాము మూడు గ్రూపులుగా విడిపోయి వివిధ డైరెక్షన్లలో వెళ్లినట్టు ఐఏఎఫ్ ఆపరేషన్‌లో సురక్షితంగా బయపడిన కార్మికులు వెల్లడించారు. వీరంతా బాగా నీరసంగా ఉన్నారని, సరిగా మాట్లాడలేకపోతున్నట్టు అధికారులు తెలిపారు. వీరిగి తగిన వైద్య సహాయంతో పాటు, ఇతర అవసరాలను కూడా అందిస్తున్నట్టు కురుంగ్ కుమే జిల్లా ఎస్‌పీ తెలిపారు. కాగా, ఒక కార్మికుడి మృతదేహం డామన్ సర్కిల్‌లోని ఫురక్ నదిలో కనిపించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

Updated Date - 2022-07-23T23:51:39+05:30 IST