Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సెరెనా దూరం

మెల్‌బోర్న్‌: ఏడుసార్లు చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ వచ్చే జనవరి 17 నుంచి జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనడం లేదు. టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల జాబితాను నిర్వాహకులు బుధవారం ప్రకటించగా.. అందులో సెరెనా పేరు లేదు. తన వైద్య బృందం సూచన మేరకు సెరెనా ఈసారి ఈవెంట్‌కు దూరంగా ఉంటోందని వారు తెలిపారు.  తొడ కండరాల గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్‌ తొలిరౌండ్‌ మధ్యలోనే వెనుదిరిగిన 40 ఏళ్ల సెరెనా.. అప్పటి నుంచి మరే టోర్నీలోనూ ఆడలేదు. 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలోనున్న సెరెనా.. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో చివరి మేజర్‌ టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ గాయంతో ఈసారి టోర్నీ బరిలో దిగడం లేదు.

Advertisement
Advertisement