కేటీపీఎస్‌లో ఏడు కొత్త భద్రతా పోస్టులు

ABN , First Publish Date - 2020-06-07T10:26:16+05:30 IST

జెన్‌కోలో తొలి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఏడోదశ భద్రతను మరింత కట్టుదిట్టం చేయన్నారు. కర్మాగారంలో ఏడు కొత్త వాచ్‌

కేటీపీఎస్‌లో ఏడు కొత్త భద్రతా పోస్టులు

చోరీల అడ్డుకట్టకు ఎస్‌పీఎఫ్‌ అధికారుల ప్రతిపాదన

సందర్శించిన కమాండెంట్‌, జెన్‌కో విజిలెన్స్‌ ఎస్‌పీ


పాల్వంచ, జూన్‌ 6: జెన్‌కోలో తొలి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఏడోదశ భద్రతను మరింత కట్టుదిట్టం చేయన్నారు. కర్మాగారంలో ఏడు కొత్త వాచ్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రత్యేక భద్రతాదళం (ఎస్‌పీఎఫ్‌) భావిస్తోంది. ఈనేపఽథ్యంలో ఎస్‌పీఎఫ్‌ కమాండెంట్‌ అన్వర్‌బాషా జెన్‌కో విజిలెన్స్‌ ఎస్‌పీ వినోద్‌ కుమార్‌తో కలిసి రెండు రోజుల పాటు కేటీపీఎస్‌ ఓఅండ్‌ ఎం, 5, 6, 7 దశల్లోని పలు భద్రతా వాచ్‌పోస్టులను పరిశీలించారు. కేటీపీఎస్‌ పాత ప్లాంటు కూల్చివేత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోస్టులను అలాగే కొనసాగి స్తూ ఏడోదశకు అదనపు పోస్టులు సమకూర్చుకోవాలనే దిశగా ప్రయత్నాలు ఆరంభించారు. ఇప్పటికే సరయిన పర్యవేక్షణా లేమి కారణంగా కేటీపీఎస్‌లో పలు చోరీ ఘటనలు వెలుగుచూడటంతో భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కా కుండా చూడాలని ఎస్‌పీ, కమాండెంట్‌లు స్థానిక అధికారులకు సూచనలు చేశా రు.


ప్రతీ నెలా రీ-సర్వే పేరిట కర్మాగారాల్లో భద్రతను పర్యవేక్షించే అధికారులు ఈసారి కొత్త పోస్టుల ఏర్పాటుపై దృష్టి సారించటం విశేషం. ఏడోదశకు హద్దులు నిర్ణయించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను చేపట్టడం మూలంగా చోరీలను అదుపుచేయవచ్చునని అధికారులు అంచనాకు వచ్చారు. అందులో భాగంగానే కొత్త వాచ్‌ పోస్టులను ప్రతిపాదించారు. కేటీపీఎస్‌ ఐదోదశ కొత్త రైల్వే వంతెన వద్ద కూడా మరో వాచ్‌ పోస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు. అధికారుల వెంట కేటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరావు, కేటీపీఎస్‌ సివిల్‌ ఎస్‌ఈ యుగపతి, ఈఈ రవీందర్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ కోటేశ్వరావు ఉన్నారు.

Updated Date - 2020-06-07T10:26:16+05:30 IST