మరో ఏడుగురి మృత్యువాత

ABN , First Publish Date - 2020-09-22T11:01:02+05:30 IST

కరోనాతో పోరాడుతూ సోమవారం మరో ఏడుగురు మృతి చెందారు.దీంతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 594కు చేరింది. మరోవైపు జిల్లాలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం రాత్రి 7గం

మరో ఏడుగురి మృత్యువాత

649 కొత్త కరోనా కేసుల నమోదు    


  చిత్తూరు/తిరుపతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కరోనాతో పోరాడుతూ సోమవారం మరో ఏడుగురు మృతి చెందారు.దీంతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 594కు చేరింది. మరోవైపు జిల్లాలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం రాత్రి 7గంటల వరకు కొత్తగా 649 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 57,791కి చేరింది. సాంకేతిక సమస్య కారణంగా ఆది, సోమవారాల్లో నమోదైన కేసులను ఒకేసారి విడుదల చేశారు. వీటిలో తిరుపతిలో 138, చిత్తూరులో 71, తిరుపతి రూరల్‌లో 34, రేణిగుంటలో 31, మదనపల్లెలో 32, శ్రీకాళహస్తిలో 29 చొప్పున కేసులు నమోదయ్యాయి. సోమవారం ఏడుగురు కరోనాతో మరణించారని జేసీ చంద్రమౌళి తెలిపారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 594కు చేరింది.మరోవైపు కరోనా నుంచి కోలుకున్న 167మంది సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు.,



కొవిడ్‌ సెంటర్లలో 2,777 పడకల ఖాళీ 

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో  సోమవారం రాత్రి 10  గంటల వరకు 2,777 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2,604 సాధారణ, 173 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. సాధారణ పడకలకు సంబంధించి రుయాలో 127, స్విమ్స్‌ 154,ఈఎస్‌ఐలో  9,  విష్ణునివాసంలో  245 (డార్మెటరీ), 158 (గదుల్లో).. మాధవంలో 335.. పద్మావతి నిలయంలో 190, గోవిందరాజసత్రంలో 824. శ్రీనివాసంలో గదుల్లో 240, డార్మెటరీలో 280, టీటీడీ ఉద్యోగులకు 42 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ రుయాలో 91, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 32  అందుబాటులో ఉన్నాయి.  ఐసీయూలో  బెడ్స్‌ రుయాలో 9, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 41 అందుబాటులో ఉన్నాయి.    

Updated Date - 2020-09-22T11:01:02+05:30 IST