Brazil:కూలిన విద్యుత్ పైలాన్..ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2021-07-17T13:03:37+05:30 IST

బ్రెజిల్ దేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు....

Brazil:కూలిన విద్యుత్ పైలాన్..ఏడుగురి మృతి

బ్రెసీలియా (బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఉత్తర బ్రెజిల్ దేశం పారా రాష్ట్రంలోని పకజా మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్ పైలాన్ ఒక్క సారిగా కూలిపోయింది. ఈ పైలాన్ కూలిన దుర్ఘటనలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు. విద్యుత్ పైలాన్ నిర్మిస్తుండగా అది ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యుత్ పైలాన్ కూలిపోవడానికి కారణాలు తెలియలేదు.

Updated Date - 2021-07-17T13:03:37+05:30 IST