విజయవాడ ఆర్టీసీ జోన్‌ పరిధిలోకి ఏడు జిల్లాలు

ABN , First Publish Date - 2022-05-15T06:21:07+05:30 IST

విజయవాడ ఆర్టీసీ జోన్‌ పరిధిలోకి ఏడు జిల్లాలు

విజయవాడ ఆర్టీసీ జోన్‌ పరిధిలోకి ఏడు జిల్లాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీ విజయవాడ జోన్‌ పరిధిలోకి ఏడు జిల్లాలు చేరాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా విజయవాడ ఆర్టీసీ జోన్‌ను మారుస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు విజయవాడ జోన్‌ ఆర్టీసీ పరిధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండేవి. జిల్లాల పునర్విభజనలో భాగంగా విజయవాడ జోన్‌ నుంచి గుంటూరు జిల్లాను తప్పించారు. ఎన్టీఆర్‌, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలను తీసుకొచ్చారు. ఈ ఏడు జిల్లాలకు విజయవాడ హెడ్‌ క్వార్టర్‌గా ఉంటుంది. విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) గిడుగు వెంకటేశ్వరరావు జోనల్‌ ఉన్నతాధికారిగా వ్యవహరిస్తారు.

Updated Date - 2022-05-15T06:21:07+05:30 IST