Abn logo
Sep 26 2021 @ 00:00AM

వెంకటేశ్వర్లుకు సేవాశక్తి పురస్కారం

వెంకటేశ్వర్లు సన్మానిస్తున్న యువతేజం సభ్యులు

ఏర్పేడు, సెప్టెంబరు 26: మండలానికి చెందిన యువ సమాజ్‌ నిర్మాణ్‌ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తాళిక్కాల్‌ వెంకటేశ్వర్లుకు సేవాశక్తి పురస్కారం లభించింది. లాక్‌డౌన్‌ సమయంలో గిరిజనులకు ఆయన చేసిన సేవలను గుర్తించి యువతేజం ట్రస్టు నిర్వాహకులు అవార్డుకు ఎంపిక చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా వెంకటేశ్వర్లు సేవా శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో మహమ్మద్‌ ఇంతియాజుద్దీన్‌, బబ్లూ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.