Apr 16 2021 @ 12:11PM

తెలుగు, బంజారా భాష‌ల్లో`సేవాదాస్‌` టైటిల్ సాంగ్ లాంచ్

‘గోర్‌ జీవన్‌’ చిత్రంతో హీరోగా, దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న  కేపియన్‌ చౌహాన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘సేవాదాస్‌’.  తెలుగు, బంజారా భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో  ప్రీతి అశ్రాని హీరోయిన్‌.   మ‌రో హీరోయిన్‌గా రేఖా నిరోషా న‌టిస్తోంది.  సీనియర్‌ నటులు సుమన్‌,  భానుచందర్ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. హాథీరామ్‌ బాలాజీ క్రియేషన్స్‌  పతాకంపై  వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాష‌కు సంబంధించిన  టైటిల్‌ సాంగ్‌ను గురువారం  ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.  ఈ పాటను యువ గాయకుడు స్వరాగ్‌ ఆపించారు.  

నిజాయితీకి మారుపేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు  కథ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది  ‘సేవాదాస్‌’ చిత్ర కథాంశం.  ఈ చిత్రం షూటింగ్‌  కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  ప్రస్తుతం  పోస్ట్‌ ప్రొడక్షన్‌ పను ఆఖరి దశలో ఉన్నాయి. త్వరలో ఆడియో   విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన అనంత‌రం న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ ఎనిమిది వేర్వేరు భాష‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించాన‌ని.. `సేవాదాస్` తాను న‌టిస్తోన్న తొమ్మిదో భాషా చిత్ర‌మ‌ని తెలిపారు. 

ద‌ర్శ‌కుడు, హీరో కేపియ‌న్ చౌహాన్ మాట్లాడుతూ``గోర్ జీవ‌న్‌` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులు, బంజ‌రా క‌మ్యూనిటీ వాళ్లు నన్ను ఎంత‌గానో ఆద‌రించారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రెండో చిత్రంగా తెలుగు, బంజారా భాష‌ల్లో `సేవాదాస్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నా.  జంబారా క‌మ్యూనిటీకి ఆది గురువైన సేవాలాల్ పాత్ర‌లో సుమ‌న్ గారు ఒదిగిపోయారు`` అన్నారు. నిర్మాతలు వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్  మాట్లాడుతూ ``నేను నా మిత్రుడు సీతారామ్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.  ద‌ర్శ‌కుడు చౌహాన్  బంజారా భాష‌లో రూపొందించిన `గోర్ జీవ‌న్` సినిమాతో స‌క్సెస్ కొట్టారు.  బంజారా చిత్రాల‌కు చౌహాన్ ఐకాన్ అని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న స్పూర్తితో ప్ర‌స్తుతం చాలా బంజారా చిత్రాలు వ‌స్తున్నాయి.  ఖ‌ర్చుకు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను తెర‌కెక్కించాం. త్వ‌ర‌లో ఆడియో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.