Abn logo
Oct 17 2021 @ 00:11AM

నిజాలను నిగ్గు తేల్చండి

మాట్లాడుతున్న లలితకుమారి

 మహిళ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయండి

 మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డిమాండ్‌

శృంగవరపుకోట రూరల్‌ (జామి), అక్టోబరు 16: మహిళ అనుమా నాస్పద మృతిపై నిజాలను నిగ్గుతేల్చాలని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి డిమాండ్‌ చేశారు. శనివారం అలమండలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నెల 13న గ్రామానికి చెందిన మహిళ అనుమా నాస్పద మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీఐతో చర్చించారు. కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఘటనా ప్రదేశం మందు బాబులు, పేకాటరాయుళ్లు తిరుగుతుంటారని..అందుకే సమగ్ర దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన తరువాత మహిళలు పొలాలకు వెళ్లేం దుకు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయని స్థానికులు మాజీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుం బానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌, విశాఖ పార్లమెంటరీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మాకిరెడ్డి శ్రీలక్ష్మి, ఎంపీటీసీ డెక్క శ్రీను, మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు, మాజీ సర్పంచ్‌ ఇప్పాక వెంకటత్రివేణి, స్థానిక నాయకులు లగుడు రవికుమార్‌, ఎల్‌.అప్పలనాయుడు, సూరెడ్డి వెంకటరావు, బర్ల దేముడు, బీల త్రివేణీ, దనిమిరెడ్డి శ్రీను, లగుడు సత్యరావు, అప్పలసత్యం, భీమవరపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.