శేషశయనం దేశభక్తి స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-08-10T05:43:08+05:30 IST

స్వాతంత్య్ర సమరంలో తెల్లదొరల గుండెల్లో దడ పుట్టించిన శేషశయనం దేశభక్తి స్ఫూర్తిదాయకమని ఆయన కుమారులు సురేంద్రనాథ్‌, నరసింహమూర్తి పేర్కొన్నారు.

శేషశయనం దేశభక్తి స్ఫూర్తిదాయకం
శేషశయనం (ఫైల్‌)

కుమారులు సురేంద్రనాథ్‌, నరసింహమూర్తి


పెనుకొండ, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరంలో తెల్లదొరల గుండెల్లో దడ పుట్టించిన  శేషశయనం దేశభక్తి స్ఫూర్తిదాయకమని ఆయన కుమారులు సురేంద్రనాథ్‌, నరసింహమూర్తి పేర్కొన్నారు. మంగళవారం వారు స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. స్వ గ్రామం పెనుకొండ మండలం శెట్టిపల్లి కాగా, పెనుకొండకు వచ్చి స్థిరపడ్డామన్నారు.  తండ్రి చిన్ననాటి నుంచి దేశభక్తిని అవలంభించుకున్నారన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర స మరయోధులు కల్లూరు సుబ్బారావుకు శిష్యుడిగా ఉంటూ, ఆయన స్ఫూర్తితో స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఆ కాలంలోనే అస్పృశ్యత, హరిజనోద్ధరణ కు పాటుపడ్డారని అన్నారు. దీనివల్ల సమాజంలో వ్యతిరేకత, అవమానాలు, అవహేళనకు గురయ్యాడన్నారు. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడన్నారు. రాయల వే సవి విడిది గగన్మహాల్‌లో అప్పట్లో డిప్యూటీ ఇనస్పెక్టర్‌ కార్యాలయంగా ఉండేదని, 1942 అక్టోబరు 20న నాన్నతో పాటు మరికొందరు సహచరులతో కలిసి కార్యాలయానికి నిప్పు పెట్టడం జరిగిందన్నారు. ఈకేసులో నాన్నను అక్టోబరు 27న అరె్‌స్టచేసి జైలుకు పంపారన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత 1974లో నాన్నగారికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసాపత్రం అందించి గౌరవించడం జరిగిందన్నారు. 


కుటుంబ సభ్యులకు సన్మానం

స్వాతంత్య్ర సమరయోధుల సేవలు మరువలేనివని తహసీల్దార్‌ స్వర్ణలత, ఎంపీడీఓ శివశంకరప్ప, కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆజాదీకా అమృతమహోత్సవ్‌లో భాగంగా పెనుకొండలోని పంచాంగం శేషసయనం కుటుంబసభ్యులను స న్మానించారు. వారి స్వగృహానికి వెళ్లి ఆయన కుమారులైన సురేంద్రనాథ్‌, నరసింహమూర్తి, మనుమడు శేఖర్‌, కుటుంబ సభ్యులకు పూలమాలలువేసి శాలువాలు కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలిత మే మనం ఈనాడు స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. అమరులైన వారి త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తించుకుని దేశభక్తిని చాటాలన్నారు. శేషశయనం కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 


Updated Date - 2022-08-10T05:43:08+05:30 IST