కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు

ABN , First Publish Date - 2022-01-23T06:15:17+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన ప్లాంట్‌ వివరాలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రవీంద్ర

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు

ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ 

దేవరకొండ, జనవరి 22: ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటు గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దా తల సహకారంతో రూ. 30లక్షలతో ఏర్పాటు చేసిన ఐసీయూను ఆయన ప్రారంభించి మాట్లాడారు. త్వరలో ఆక్సిజన ప్లాంట్‌ పనులు కూడా పూర్తవుతాయని అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్ని పడకలకు ఆక్సిజన అందేలా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవఖానాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోలేదని వి మర్శించారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన దామోదర్‌ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే శనివారం సూర్యతండాలో పరామర్శించారు. సర్పంచ కొర్ర దామోదర్‌ మృతి బాధాకరమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. కార్యక్రమంలో దేవరకొండ మునిసిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సిం హ, డీసీహెచ మాతృనాయక్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములునాయక్‌, వైస్‌ ఎంపీపీ సుభా్‌షగౌడ్‌, నాయకులు శిరందాసు కృష్ణయ్య, టీవీఎనరెడ్డి, హనుమంతు వెంకటే్‌షగౌడ్‌, డాక్టర్‌ మోతీలాల్‌, కృష్ణ, గోపాల్‌, కామేశ్వర్‌, జయప్రకాష్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-01-23T06:15:17+05:30 IST