104 ఉద్యోగులకు సర్వీసు వెయిటేజి కల్పించాలి

ABN , First Publish Date - 2020-08-09T12:01:11+05:30 IST

ఉద్యోగ నియామకాల్లో 104 ఉద్యోగులకు సర్వీసు వెయిటేజి కల్పించాలని 104 ఉద్యోగులు సంఘం గౌరవాధ్యక్షుడు సతీష్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ ..

104 ఉద్యోగులకు సర్వీసు వెయిటేజి కల్పించాలి

నెల్లూరు (వైద్యం)ఆగస్టు 8 : ఉద్యోగ నియామకాల్లో 104 ఉద్యోగులకు సర్వీసు వెయిటేజి కల్పించాలని 104 ఉద్యోగులు సంఘం గౌరవాధ్యక్షుడు సతీష్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైద్య విధానపరిషత్‌లో ప్రకటించిన ఫార్మసిస్ట్‌ జాబితాలో 104 ఉద్యోగులకు సర్వీస్‌ వెయిటేజి మార్క్‌ కలపక పోవటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దరఖాస్తుల రిమార్క్‌లో 10 ఏళ్ల అటెండన్స్‌ సర్టిఫికెట్లు కావాలని అధికారులు ఒత్తిడి చేయటం వెనుక అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, కలెక్టర్‌ పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.


Updated Date - 2020-08-09T12:01:11+05:30 IST