సేవల రంగంలో స్తబ్ధత

ABN , First Publish Date - 2021-05-06T06:35:45+05:30 IST

భారత సేవల రంగం వృద్ధి ఏప్రిల్‌లో మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కరోనా-2 విజృంభణ కారణంగా సెంటిమెంట్‌ దెబ్బ తినడం, వ్యాపార కార్యకలాపాలు తగ్గడం ఇందుకు కారణం...

సేవల రంగంలో స్తబ్ధత

న్యూఢిల్లీ: భారత సేవల రంగం వృద్ధి ఏప్రిల్‌లో మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కరోనా-2 విజృంభణ కారణంగా సెంటిమెంట్‌ దెబ్బ తినడం, వ్యాపార కార్యకలాపాలు తగ్గడం ఇందుకు కారణం. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ వ్యాపార కార్యకలాపాల సూచీ పీఎంఐ ఏప్రిల్‌ నెలలో 54 పాయింట్లుగా నమోదయింది. మార్చిలో ఇది 54.6 పాయింట్లుంది. అయితే వృద్ధికి తిరోగమనానికి విభజన రేఖ 50 పాయింట్ల కన్నా పైనే ఉండడం కొంత ఊరట. రాబోయే 12 నెలల కాలంలో కార్యకలాపాలు పుంజుకోవడం ఖాయమనే నమ్మకం మాత్రం పలు సంస్థలు ప్రకటిస్తున్నాయి. 


7 శాతం తగ్గిన మారుతి ఉత్పత్తి: ఏప్రిల్‌ నెలలో కార్ల దిగ్గజం మారుతి సుజుకీ ఉత్పత్తి 7 శాతం క్షీణించింది. మార్చిలో 1,72,433 కార్లు ఉత్పత్తి చేసిన కంపెనీ ఏప్రిల్‌లో 1,59,955 కార్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. అయితే కొవిడ్‌-19 తొలి విడత ప్రభావం అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఈ సంస్థ ఒక కారును కూడా ఉత్పత్తి చేయలేదు.


Updated Date - 2021-05-06T06:35:45+05:30 IST