‘సేవా’ భారం:!

ABN , First Publish Date - 2020-09-20T09:50:33+05:30 IST

గ్రామ వార్డు సచివాల యాల్లో అందించే సేవలకు రుసుములు పెరిగాయి. ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ నెలకొల్పిన ఏడాదిలోనే సర్వీసు ఛార్జీల పేరిట కొన్ని రకాల సేవలకు రుసుము లను అధికంగానే పెంచే

‘సేవా’ భారం:!

 సచివాలయాల్లో భారీగా పెరిగిన రుసుములు

 మీ సేవా తరహాలోనే వసూళ్లు


సామర్లకోట, సెప్టెంబరు 19: గ్రామ వార్డు సచివాల యాల్లో అందించే సేవలకు రుసుములు పెరిగాయి. ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ నెలకొల్పిన ఏడాదిలోనే సర్వీసు ఛార్జీల పేరిట కొన్ని రకాల సేవలకు రుసుము లను అధికంగానే పెంచేసింది. గతంలో మీసేవా కేంద్రా లతో పోలిస్తే సచివాలయాల్లో సేవలపై రుసుములు చాలా తక్కువగా ఉండేవి. ప్రభుత్వం ఇటీవల నెల రోజు లుగా వాటిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో ప్రజలకు మరింత ఆర్థిక భారంగా మారింది. సంక్షేమ పఽథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశం తో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ఏడాది ప్రారంభించింది. వీటి ద్వారా ప్రజలకు 27 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 540 రకాల సేవలం దించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.


గతంలో విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, రైతులు అడంగల్‌, 1బీ వంటి సేవలు పొందాలంటే తప్పనిసరిగా మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో చాలా వరకూ సేవలు సులువుగానే లభిస్తున్నాయి. అయితే గత నెల 21 నుంచి వాటిలో వివిధ సేవలకు రుసుములు పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సచివాలయంలో పెరిగిన రుసుములను వసూలు చేస్తున్నారు.


గతంలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, అడంగల్‌, 1బీ పత్రాలకు సేవా రుసుము రూ.15 ఉండగా నేడు రూ.35 నుంచి రూ.45 వరకూ వసూలు చేస్తున్నారు. ఓటర్‌ కార్డుకు రూ.10 ఉండ గా నేడు రూ.20కు పెంచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఆదాయ, కుల ఽద్రువీకరణ పత్రాలు అవసరం. అలాగు అడంగల్‌, 1బీ వంటి సేవలపై రుసు ములు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతు న్నారు.


ప్రతి మండలంలో నెలకు ఆయా దరఖాస్తులు సుమారు 2 వేల నుంచి 4 వేల వరకూ వస్తుంటాయని అంచనా. అలాగే మండలాల్లో అడంగల్‌ 1బీలు నెలకు 500 పైబడి అవసరం అవుతుంటాయి. బ్యాంకు రుణాలు పొందే సమయంలో వీటి అవసరం ఎక్కువగానే ఉం టుందని రైతులు పేర్కొంటున్నారు. రుసుముల పెంపుపై మండల స్థాయి అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా తప్పుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


చాలా వరకు దరఖాస్తులు బుట్టదాఖలు అవుతున్నాయని కొంత మంది వాపోతున్నారు. గడువు పూర్తయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తాజాగా ధరల పెంపుతో మరిన్ని కష్టాలు తప్పవని, రుసుముల భారం తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2020-09-20T09:50:33+05:30 IST