యూకేలో భారీ పెట్టుబడులు పెట్టే యోచనలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్

ABN , First Publish Date - 2021-05-05T06:32:06+05:30 IST

భారత్‌లో కొవిషీల్డ్ ఉత్పత్తిదారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. యూకేలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ తమ వ్యాక్సిన్ వ్యాపారాన్ని విస్తరించడం కోసం, నూతన సేల్స్ ఆఫీస్ ఏర్పాటు చేయడం కోసం

యూకేలో భారీ పెట్టుబడులు పెట్టే యోచనలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్

లండన్: భారత్‌లో కొవిషీల్డ్ ఉత్పత్తిదారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. యూకేలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ తమ వ్యాక్సిన్ వ్యాపారాన్ని విస్తరించడం కోసం, నూతన సేల్స్ ఆఫీస్ ఏర్పాటు చేయడం కోసం 240 మిలియన్ల యూరోలు అంటే మన రూపాయల్లో రూ.2,460 కోట్లు పెట్టుబడులు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇక్కడ పెట్టనుంది. ఇది యూకే-ఇండియా మధ్య 1 బిలియన్ యూరోల వాణిజ్య భాగస్వామ్యంలో భాగమట. ఈ భాగస్వామ్యం వల్ల 6,500 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. తమ సింగిల్ డోస్ నాజల్ కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యూకేలో ఇప్పటికే ప్రారంభించింది.

Updated Date - 2021-05-05T06:32:06+05:30 IST