ఒమైక్రాన్‌కు చెక్‌ పెట్టే టీకా?!

ABN , First Publish Date - 2022-01-01T06:27:30+05:30 IST

కరోనాపై పోరులో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మరో అడుగు ముందుకు వేసింది. కొవిడ్‌ టీకా ‘కొవిషీల్డ్‌’ను ఉత్పత్తి చేస్తున్న ఆ కంపెనీ.. త్వరలో ‘కోవోవ్యాక్స్‌’నూ ఉత్పత్తి చేయనుంది. స్పైక్‌ ప్రొటీన్‌లో భారీ

ఒమైక్రాన్‌కు చెక్‌ పెట్టే టీకా?!

  • అభివృద్ధికి కసరత్తు ప్రారంభించిన ‘సీరం’
  • డీసీజీఐ పచ్చజెండా కొవిషీల్డ్‌కు పూర్తిస్థాయి 
  • అనుమతులివ్వండి పూనావాలా వినతి


న్యూఢిల్లీ, డిసెంబరు 31 : కరోనాపై పోరులో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మరో అడుగు ముందుకు వేసింది. కొవిడ్‌ టీకా ‘కొవిషీల్డ్‌’ను ఉత్పత్తి చేస్తున్న ఆ కంపెనీ.. త్వరలో ‘కోవోవ్యాక్స్‌’నూ ఉత్పత్తి చేయనుంది. స్పైక్‌ ప్రొటీన్‌లో భారీ జన్యుమార్పులతో దడ పుట్టిస్తున్న ఒమైక్రాన్‌ వేరియంట్‌కు చెక్‌ పెట్టే టీకా అభివృద్ధికి కూడా ‘సీరం’ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పైక్‌ ప్రొటీన్‌ ఆధారిత ఔషధ పదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు నడుం బిగించింది. ఒమైక్రాన్‌కు విరుగుడుగా పనిచేసే ‘రీకాంబినంట్‌ స్పైక్‌ నానో పార్టిక్‌ల్‌’ రకం వ్యాక్సిన్‌ తయారీకి ఈ ఔషధ పదార్థాన్ని వినియోగించనున్నారు. దీని ఉత్పత్తితో పాటు ఒమైక్రాన్‌పై పనిచేయగల వ్యాక్సిన్‌ తయారీకి అది ఉపయోగపడుతుందా? లేదా? అనేది తెలుసుకునేందుకు పరీక్షల నిర్వహణకు అనుమతులు కోరుతూ సీరం కంపెనీ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్‌ సింగ్‌ సమర్పించిన దరఖాస్తుపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఇక కొవిషీల్డ్‌ టీకాకు పూర్తి స్థాయి అనుమతుల కోసం డీసీజీఐకు దరఖాస్తు ఇచ్చినట్లు ‘సీరం’ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు.

Updated Date - 2022-01-01T06:27:30+05:30 IST