Flip kart మహిళా గ్రూపుల ఉత్పత్తులు ఫ్లిప్ కార్డ్ లో: Errabelli

ABN , First Publish Date - 2022-05-17T23:54:22+05:30 IST

మహిళా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ లోనూ అలాగే ఫ్లిప్ కార్డ్ వస్తువులు మహిళా గ్రూప్ స్టోర్స్ లో అందుబాటేలో ఉంఛేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకుంటోంది.

Flip kart మహిళా గ్రూపుల ఉత్పత్తులు ఫ్లిప్ కార్డ్ లో: Errabelli

వరంగల్: మహిళా గ్రూపుల ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ లోనూ అలాగే ఫ్లిప్ కార్డ్ వస్తువులు మహిళా గ్రూప్ స్టోర్స్ లో అందుబాటేలో ఉంఛేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకుంటోంది.వనపర్తి తరహాలో వరంగల్ లో ప్రయోగం ముందుగా జనగామ జిల్లాలో తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు.జీవనోపాధికి, పారిశ్రామికులను తయారు చేయడానికి ఉపయోగపడడమే కాకుండా వాటికి మంచి మార్కెట్ అవకాశాల మెరుగుపడతాయని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఒప్పందం, ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) ఆదేశాలు ఆదేశించారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘాలు, వాటి సమాఖ్య లను ప్రోత్సహిస్తూ, ఆర్థిక వనరులను అందుబాటులోకి తెస్తూ, వివిధ జీవనోపాధులను కల్పిస్తూ వస్తున్నది. అలాగే, మహిళా సంఘాల ద్వారా వివిధ వస్తువుల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నది. 


ఆ ఉత్పత్తులకు మార్కెట్ ను అనుసంధానిస్తున్నది. ఈ నేపథ్యంలో మన సంఘాలు, సమాఖ్యలు చేస్తున్న ఉత్పత్తుల కు మరింత మెరుగైన మార్కెట్ వసతి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పేదరిక నిర్మూలన సంస్థ (SERP), ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్ కార్డ్ (flip kart)తో ఒప్పందానికి సిద్ధ పడింది. ఇందుకు ఫ్లిప్ కార్డ్ కు సై అంది. ఇప్పటికే వనపర్తి జిల్లాలో ఇలాంటి ఒప్పందం చేసుకున్న ఆ సంస్థ మంగళవారం ఇదే విషయమై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆ సంస్థ ప్రతినిధులు వరంగల్ హన్మకొండ క్యాంప్ కార్యాలయంలో  కలిశారు. 


స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులను ఫ్లిప్ కార్ట్ తన online లో పెడుతుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ వ్యాపార వస్తువులను మన స్వయం సహాయక సంఘాల స్టోర్స్, స్టాల్స్ లో అమ్మకానికి పెడతారు. ఈ ఇచ్చి పుచ్చుకునే వ్యాపార వ్యవహారం ద్వారా పరస్పరం లాభం పొందుతాయి. తద్వారా ఇరు వర్గాల వ్యాపారం, మార్కెట్ విస్తారం అవుతుంది. లాభాలు వస్తాయి. అలాగే FPO ల నుండి రైతులు పండించిన పంటలను కూడా అందుబాటులో ఉంచుతారు.జిల్లాలో ఏర్పాటు చేసిన 60 తెలంగాణ స్త్రీ శక్తి మార్టులను కూడా బలోపేతం అవుతాయి. చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులు కూడా ప్రపంచానికి చేరువ అవుతాయి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం పేదరిక నిర్మూలనకు, స్వయం సహాయక సంఘాలకు, సమాఖ్య లకు, ఉత్పత్తులను ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ముందుగా జనగామ జిల్లాలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మంత్రి చెప్పారు. ఇందుకు తగిన విధివిధానాల ను రూపొందించాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-17T23:54:22+05:30 IST