Abn logo
Jun 22 2021 @ 12:32PM

నేటి నుంచి తెలంగాణలో సీరో సర్వే

హైదరాబాద్: దేశంలో ఎంత శాతం మంది ప్రజలు కరోనా బారిన పడ్డారనే అంశాన్ని నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధన మండలి చేపట్టిన అధ్యయనంలో భాగంగా తెలంగాణలో మంగళవారం నుంచి నాలుగో విడత సీరో సర్వే జరగనుంది. హైదరాబాద్‌లోని ఐసీఎమ్మార్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా గత ఏడాది మే, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో జనగామా, కామారెడ్డి,  నల్లగొండ జిల్లాల్లో చేపట్టిన సర్వేకు కొనసాగింపుగా అక్కడే నాలుగో రౌండ్ సర్వే నిర్వహించనున్నారు. 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన కౌమారదశ పిల్లలు, 18 ఏళ్లకు పైబడిన వయెజనుల్లో ఎంతమేరకు ఐజీజీ యాంటీబాడీలు ఉన్నాయో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈసారి సర్వే జరగనుంది.