హేతుబద్ధీకరణతో విద్యారంగానికి తీవ్రనష్టం

ABN , First Publish Date - 2022-06-30T05:10:23+05:30 IST

హేతుబద్ధీకరణతో విద్యా రంగానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు గంటా మోహన తెలిపారు.

హేతుబద్ధీకరణతో విద్యారంగానికి తీవ్రనష్టం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్టీయూ నేత గంటా మోహన

మదనపల్లె క్రైం, జూన 29: హేతుబద్ధీకరణతో విద్యా రంగానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు గంటా మోహన తెలిపారు. బుధవారం మదనపల్లెలోని ఎస్టీయూ భవనలో డివిజన స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, టీచర్‌ పోస్టుల హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 117తో విద్యారంగానికి, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు తీవ్రనష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుంద న్నారు. జూనియర్‌ లెక్చరర్ల పదోన్నతులను సత్వరమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అత్తెసరు పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్ములు కూడా మాయం చేస్తుండడం దారుణమన్నారు. ఏపీజీఎల్‌ఈ, పీఎఫ్‌ రుణాలు, పదవీ విరమణ పొందిన వారికి తుదిమొత్తాల చెల్లింపుల్లో తీవ్రజాప్యం చేస్తుండడం అన్యాయమన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోకల మధుసూదన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో అందరికీ అన్యాయం జరుగుతుందన్నారు. జీవోను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవోను సవరించి, ప్రాథమిక విద్యను బలో పేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు ఆర్‌.వి.రమణ, బాల సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, గిరిధర్‌నాయక్‌, రాజారెడ్డి, అశోక్‌, భాస్కర్‌రెడ్డి, విద్యాధర్‌, మొగిలీశ్వర్‌, లక్ష్మీపతి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:10:23+05:30 IST