Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆక్రమణలపై సీరియస్‌

twitter-iconwatsapp-iconfb-icon
ఆక్రమణలపై సీరియస్‌చెరువులో ఆక్రమణలను పరిశీలిస్తున్న ఆర్డీవో


నివేదిక కోరిన కలెక్టర్‌
విచారించిన ఆర్డీవో అప్పారావు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌
రాజాం, ఆగస్టు 8:
మునిసిపాలిటీ పరిధిలోని కొండంపేట గ్రామానికి చెందిన వీర్రాజుచెరువు ఆక్రమణలపై అధికారులు స్పందించారు. చీపురుపల్లి ఆర్డీవో ఎమ్‌.అప్పారావు సోమవారం విచారణకు వచ్చారు. వివరాల కోసం లోతుగా ఆరా తీశారు. రాజాంలో కబ్జా పర్వంపై ‘కబ్జా చేసి అద్దెకు ఇస్తాం’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని కలెక్టర్‌ సూర్యకుమారి పరిశీలించారు. దీనిపై స్పందిస్తూ పూర్తిస్థాయిలో విచారించి నివేదిక అందజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆ మేరకు ఆయన చెరువును సోమవారం పరిశీలించారు. అక్కడే నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గుడికి వెళ్లడానికి చెరువులో పిల్లర్లు నిర్మించి రహదారి ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీనిపై తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆక్రమణదారునికి ఆదేశించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వో, ఆర్‌ఐలతోనూ మాట్లాడారు. చెరువులో రహదారి ఏర్పాటుకు గతంలో ఎటువంటి అనుమతులేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆక్రమణ దారుడు ఎటువంటి దరఖాస్తు చేయకుండా అధికారులకు తెలియజేయకుండా నిర్మాణాలు చేపడుతున్నాడని ఆర్డీవోకు వారు తెలియజేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు పి.విజయభాస్కర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన వారు ఎవరైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట సర్వేయర్‌ సూర్యారావు ఉన్నారు.

 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.