సెరెనా శుభారంభం

ABN , First Publish Date - 2020-09-29T08:59:23+05:30 IST

రికార్డు టైటిల్‌ వేటలో ఉన్న స్పెయున్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌, మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌, అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా ..

సెరెనా  శుభారంభం

నడాల్‌, థీమ్‌ కూడా ఫ్రెంచ్‌ ఓపెన్‌


పారిస్‌: రికార్డు టైటిల్‌ వేటలో ఉన్న స్పెయున్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌, మూడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌, అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో నడాల్‌ 6-4, 6-4, 6-2తో ఇగోర్‌ జెరాసిమోవ్‌ (బెలార్‌స)పై వరుస సెట్లలో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ 6-4, 6-3, 6-3తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై, జపాన్‌ ఆటగాడు నిషియోక 7-5, 6-3, 6-3తో ఫెలిక్స్‌ అగర్‌ (కెనడా)పై, అమెరికాకు చెందిన టామీ పాల్‌ 6-2, 6-3, 6-2తో జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై, 28వ సీడ్‌ కాస్పర్‌ రెడ్‌ 6-1, 6-3, 6-1తో యూజి సుగితపై గెలిచారు.ఇటలీ ప్లేయర్‌ ఫాబియో ఫాగ్నిని 5-7, 6-3, 6-7(1), 0-6తో కుకుషిని (కజకిస్థాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. అన్‌సీడెడ్‌ ఆటగాళ్ల మధ్య 6 గంటలకుపైగా జరిగిన పోరులో లొరెంజో గస్టినో (ఇటలీ) 0-6, 7-6(7), 7-6(3), 2-6, 18-16తో  ఫ్రాన్స్‌ ఆటగాడు కొరెన్‌టిన్‌ మ్యూటెట్‌పై పోరాడి నెగ్గాడు. 


కీస్‌ అవుట్‌..:

సెరెనా 7-6(2), 6-0తో క్రిస్టీన్‌ అన్‌పై గెలిచింది. మూడో సీడ్‌ స్విటోలినా 7-6(2), 6-4తో వర్వరా గ్రచేవాపై, ఐదో సీడ్‌ కికి బెర్టెన్స్‌ 2-6, 6-2, 6-0తో కెటరీనా జవాట్స్‌స్కాపై, చెక్‌ భామ క్విటోవా 6-3, 7-5తో ఒసీన్‌ డోడిన్‌పై, అమందా అనిసిమొవా 6-2, 6-0తో తమారాపై, పిరొన్‌కొవా 6-3, 6-3తో పెట్కోవాపై నెగ్గారు. ఇటలీ క్రీడాకారిణి సారా ఎర్రాని 6-2 6-1తో మోనికా పుయుగ్‌ను, 11వ సీడ్‌ గార్బినె ముగురుజా (స్పెయిన్‌) 7-5, 4-6, 8-6తో జిడాన్‌సెక్‌ (స్లొవేనియా)ను ఓడించారు. 12వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 3-6, 6-7(2)తో జాంగ్‌ షుయ్‌ చేతిలో పరాజయం పాలైంది. 

Updated Date - 2020-09-29T08:59:23+05:30 IST