సెరెనా..ఇల్లు అమ్మేసింది!

ABN , First Publish Date - 2021-01-24T10:13:59+05:30 IST

టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌ గార్డెన్స్‌లోగల తన అధునాతనమైన ఇంటిని ..

సెరెనా..ఇల్లు అమ్మేసింది!

ఫ్లోరిడా: టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌ గార్డెన్స్‌లోగల తన అధునాతనమైన ఇంటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసింది. ఐదు బెడ్‌రూమ్‌ల ఈ భవనాన్ని గతనెలలో రూ. 20.25 కోట్లకు అమ్మిందట. 5600 చదరపు అడుగుల ఈ ఇంటిని 2015లో రూ. 18 కోట్లు వెచ్చించి సెరెనా కొనుగోలు చేసింది. అలాగే 2019 ఏప్రిల్‌లో లాస్‌ ఏంజిల్స్‌లోని ఆరు బెడ్‌రూమ్‌ల ఇంటిని 59 కోట్ల రూపాయలకు అమ్మేసింది. 2.76 ఎకరాల్లో నిర్మించిన 6,101 చదరపు అడుగుల ఆ ఇంటిని ఆమె 2006లో 48 కోట్లకు కొనుక్కుంది. 

Updated Date - 2021-01-24T10:13:59+05:30 IST