అయ్యో.. ‘వెయ్యి’!

ABN , First Publish Date - 2021-05-13T06:01:46+05:30 IST

టూర్‌ స్థాయిలో 1000వ మ్యాచ్‌ ఆడిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు నిరాశే ఎదురైంది. ఇటాలియన్‌ ఓపెన్‌ సింగిల్స్‌ రెండోరౌండ్లో ఎనిమిదో సీడ్‌ సెరెనా ఓటమిపాలైంది...

అయ్యో.. ‘వెయ్యి’!

  • సెరెనాకు చుక్కెదురు

రోమ్‌: టూర్‌ స్థాయిలో 1000వ మ్యాచ్‌ ఆడిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు నిరాశే ఎదురైంది. ఇటాలియన్‌ ఓపెన్‌ సింగిల్స్‌ రెండోరౌండ్లో ఎనిమిదో సీడ్‌ సెరెనా  ఓటమిపాలైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో నదియా పొడొరొస్కా(అర్జెంటీనా) 7-6 (8), 7-5తో సెరెనాను చిత్తుచేసింది. ఇక, రెండోసీడ్‌ ఒసాకా ఓటమిపాలైంది. రెండోరౌండ్లో జెస్సికా పెగులా (అమెరికా) 7-6(7/2), 6-2తో ఒసాకాకు షాకిచ్చింది.  


Updated Date - 2021-05-13T06:01:46+05:30 IST