ఢీకొట్టించారు.. కానీ ప్రమాదం కాదు

ABN , First Publish Date - 2021-02-24T02:51:34+05:30 IST

రైలు వచ్చింది.. అంతలోనే మరో రైలు అదే ట్రాక్‌పై వచ్చి ఆగివున్న రైలును ఢీకొట్టింది. జనం ఆర్తనాదాలు. హాహాకారాలతో ఆ ప్రాంతమంతా..

ఢీకొట్టించారు.. కానీ ప్రమాదం కాదు

నెల్లూరు: రైలు వచ్చింది.. అంతలోనే మరో రైలు అదే ట్రాక్‌పై వచ్చి ఆగివున్న రైలును ఢీకొట్టింది. జనం ఆర్తనాదాలు. హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మరోమోగిపోయింది. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. కొందరు క్రేన్ల సాయంతో బోగీల్లోకి దిగి చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. మరో బృందం బోగీలను కట్ట చేసి లోపల ఉన్న వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగించింది. ఇంతలోనే వైద్య బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దీంతో ప్రాణ నష్టం పరిమితమైంది. ఇదంతా చూస్తున్న వారికి కొత్తగాను, భయంగాను అనిపించింది. అయితే అది నిజంగా నిజంకాదు. నెల్లూరు రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే నిర్వహించిన మాక్ డ్రిల్. ప్రమాదం జరిగినట్లైతే ఎలా స్పందించాలో సిబ్బందికి నేర్పించే ప్రక్రియ అని తెలియడంతో చూస్తున్న వారంతా ఊపరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-02-24T02:51:34+05:30 IST