Abn logo
Oct 19 2020 @ 01:12AM

‘బధాయి హో’కు సీక్వెల్‌

Kaakateeya

రాజ్‌కుమార్‌ రావు, భూమి పెడ్నేకర్‌ జంటగా ‘బధాయి హో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బధాయి దో’ రానుంది. 2018లో విడుదలై జాతీయ అవార్డు అందుకున్న ఈ కామెడీ డ్రామాలో ఆయుష్మాన్‌ ఖురానా, సాన్యా మల్హోత్రా జంటగా నటించారు. ఇప్పుడు ఆ స్థానంలో రాజ్‌కుమార్‌ రావు, భూమి నటించనున్నారు. కొత్త సంవత్సరంలో ‘బధాయి దో’ సెట్స్‌పైకి వెళుతుంది. ‘‘2021 జనవరిలో ‘బధాయి దో’ సెట్‌లో కలుద్దాం’’ అని భూమి ట్వీట్‌ చేశారు. ఈ సీక్వెల్‌ను కూడా జంగ్లి పిక్చర్స్‌ సంస్థే నిర్మిస్తోంది. హర్షవర్దన్‌ కులకర్ణి దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement