సెప్టిక్‌ ట్యాంకు క్లీన్‌ చేస్తూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-23T06:42:08+05:30 IST

సెప్టిక్‌ ట్యాంకు క్లీన్‌ చేసేందుకు వెళ్లి ఊపిరాడక యువకుడు మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిపాలైన సంఘటన నాగవరప్పాడులో గురువారం జరిగింది.

సెప్టిక్‌ ట్యాంకు క్లీన్‌ చేస్తూ యువకుడి మృతి

  మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం

గుడివాడ(రాజేంద్రనగర్‌) ఏప్రిల్‌ 22 :  సెప్టిక్‌ ట్యాంకు క్లీన్‌ చేసేందుకు వెళ్లి ఊపిరాడక  యువకుడు మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిపాలైన సంఘటన నాగవరప్పాడులో గురువారం జరిగింది. జొన్నలగడ్డ వేణు సెప్టిక్‌ ట్యాంకు  క్లీన్‌ చేయించడానికి పారిశుధ్య పని వారిని గురువారం పిలిపించారు. మిషన్‌తో మొత్తం క్లీన్‌ చేశారు.  చివర నీట్‌గా క్లీన్‌ చేయాలని ఇంటి యజమాని కోరగా ధనాల రాజేష్‌ సెప్టిక్‌ ట్యాంకులోకి దిగి ఊపిరి ఆడక   స్పృహతప్పి పడిపోయాడు.  అతడిని బయటకు తీసేందుకు వెళ్లిన గేదల శివ, పాగోలు భరత్‌ కుమార్‌, వెంకి ఒక్కక్కరూ ట్యాంకు లోకి దిగి స్పృహ తప్పారు. దీంతో స్థానికంగా తాపీ పని చేస్తున్న వారిని పిలిచి లోపల ఉండిపోయిన నలుగురిని బయిటకు తీశారు. అప్పటికే రాజేష్‌ (21) మృతి చెందాడు. గేదల శివ, పాగోలు భరత్‌ కుమార్‌, వెంకిలను గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించి ఆక్సి జన్‌ అందించగా  వారు స్పృహలోకి వచ్చారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండగా వారిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  ఒన్‌టౌన్‌ సీఐ కె గోవిందరాజు ఆధ్వర్యంలో ఎస్సై సురేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-23T06:42:08+05:30 IST