Oct 19 2021 @ 01:01AM

సూర్యవంశీకి సెన్సార్‌

అక్షయ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. నవంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. తాజాగా ఈచిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘సూర్యవంశీ’కి యు/ఎ సర్టిఫికెట్‌ లభించినట్టు చిత్రబృందం సోమవారం తెలిపింది. కట్రినా కైఫ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, రణ్‌వీర్‌సింగ్‌ కీ లకపాత్రలు పోషించారు. రోహిత్‌శెట్టి దర్శకుడు.