భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2021-01-19T22:24:27+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర ..

భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు లాభాలు నమోదు చేయడంతో.. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. నిఫ్టీ సైతం 14,500  మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లలో సందడి నెలకొన్నట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 834.02 పాయింట్లు (1.72 శాతం) బలపడి 49,398.29 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 239.85 పాయింట్లు (1.68 శాతం) ఎగబాకి 14,521.15 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్‌లో 7 శాతం లాభంతో బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్‌లో ఉండగా.. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంకు, సన్ ఫార్మా, ఎన్టీపీసీ తదితర షేర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎంఅండ్ఎం తదితర షేర్లు నీరసించాయి. 

Updated Date - 2021-01-19T22:24:27+05:30 IST