సెన్సెక్స్‌ 130 పాయింట్లు అప్‌

ABN , First Publish Date - 2022-08-13T05:36:17+05:30 IST

వారాంతం ట్రేడింగ్‌లో ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ శుక్రవారంనాడు 130.18 పాయింట్లు పెరిగి 59,462.78 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 39.15 పాయింట్ల

సెన్సెక్స్‌ 130 పాయింట్లు అప్‌

ముంబై: వారాంతం ట్రేడింగ్‌లో ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ శుక్రవారంనాడు 130.18 పాయింట్లు పెరిగి 59,462.78 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 39.15 పాయింట్ల లాభంతో 17,698.15 వద్ద స్థిరపడింది. ఐటీ, ఆటో, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, పవర్‌ రంగ షేర్ల కొనుగోళ్లతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ప్రామాణిక సూచీలు లాభాల్లో పయనించడం వరుసగా ఇది నాలుగో వారం. ఈ వారంలో సెన్సెక్స్‌ 1,074 పాయింట్లు, నిఫ్టీ 300 పాయిం ట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌తో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ) మళ్లీ కొనుగోళ్లు జరుపుతుండటం ర్యాలీకి దోహదపడ్డాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. కాగా, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో మారకం విలువ మరో 12 పైస లు తగ్గి రూ.79.74 వద్ద ముగిసింది. 


ఐపీఓకు బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌ : షోలాపూర్‌కు చెందిన బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌ ఐపీఓ జారీకి అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రమోటర్‌ సంస్థలకు చెందిన 2.60 కోట్ల షేర్లను సైతం విక్రయించనున్నట్లు పత్రాల్లో పేర్కొంది. 

Updated Date - 2022-08-13T05:36:17+05:30 IST