భారీ నష్టాల్లో ముగిసిన Stock markets

ABN , First Publish Date - 2022-05-06T21:35:12+05:30 IST

ముంబై : దేశీయ Equity markets వారాంతం శుక్రవారం భారీ losses తో ముగిశాయి. Global markets cures ప్రతికూల ఉండడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

భారీ నష్టాల్లో ముగిసిన Stock markets

ముంబై : దేశీయ Equity markets వారాంతం శుక్రవారం భారీ losses తో ముగిశాయి. Global markets cues ప్రతికూల ఉండడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్, మరికొన్ని కీలకమైన కేంద్ర బ్యాంకులు అంచనా కంటే ఎక్కువగా వడ్డీ రేట్లను  పెంచనున్నాయనే రిపోర్టులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతీశాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 879 పాయింట్లు లేదా 1.58 శాతం మేర నష్టపోయి 54,823 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్లు లేదా 1.52 శాతం క్షీణించి 16,429 పాయింట్ల వద్ద క్లోజయింది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీల పరిస్థితి కూడా ఇదే. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 2.38 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 2.91 శాతం మేర భారీగా  దిగాజారాయి. నిఫ్టీపై 15 రంగాల సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు  2.09 శాతం నుంచి 2.55 శాతం వరకు దిగజారాయి.


ప్రత్యేకంగా స్టాకుల విషయానికి వస్తే టాటా మోటార్స్ 3.10 శాతం పతనమై నిఫ్టీపై అత్యధిక నష్టదారుగా నిలిచింది. హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, విప్రో షేర్లు కూడా నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. మొత్తంగా బీఎస్‌ఈపై 447 షేర్లు లాభాల్లో ముగియగా.. 2318 స్టాకులు నష్టాలతో ముగిశాయి. లాభాల్లో ముగిసిన స్టాకుల జాబితాలో ఎంఅండ్ ఎం, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ ఉండడం గమనార్హం.


Us markets డీలా...

వాల్ స్ట్రీట్, డో జోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్, ఎస్అండ్‌పీ 500 సూచీలు 3 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక నాస్‌డాక్ కంపొజిట్ 4.99 శాతం మేర భారీ స్థాయిలో పతనమైంది. జూన్ 2020 తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా 2020 నవంబర్ తర్వాత నాస్‌డాక్ తిరిగి అత్యుల్ప స్థాయికి పడిపోయింది.  

Read more