భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు..

ABN , First Publish Date - 2020-08-03T23:51:44+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా నాలుగోరోజు నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు...

భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు..

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ మరోసారి కీలకమైన 11 వేల మార్కునకు దిగువన నమోదైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 667.29 పాయింట్లు (1.77 శాతం) క్షీణించి 36,939.60 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 181.90 పాయింట్లు (1.64 శాతం) నష్టపోయి 10891.60 వద్ద క్లోజ్ అయ్యింది. యూపీఎల్, ఇండస్ట్రియల్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కొటాక్ మహీంద్రా బ్యాంకు, ఐవోసీ తదితర షేర్లు నష్టాలు నమోదు చేయగా.. టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా స్ట్రీల్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్ తదితర షేర్లు ముందంజలో ఉన్నాయి. 

Updated Date - 2020-08-03T23:51:44+05:30 IST