లాభాల నుంచి నష్టాల్లోకి

ABN , First Publish Date - 2020-03-18T06:27:06+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లను కరోనా ముప్పు ఇప్పట్లో వదిలేలా కనిపించచటం లేదు. మంగళవారం ఆరంభంలో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం వరకు అదే జోష్‌ను...

లాభాల నుంచి నష్టాల్లోకి

అమెరికాలో మాంద్య భయాలే కారణం  

సెన్సెక్స్‌ 810 పాయింట్ల పతనం

9000 దిగువకు నిఫ్టీ 

మూడేళ్ల కనిష్ఠ స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు 


ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లను కరోనా ముప్పు ఇప్పట్లో వదిలేలా కనిపించచటం లేదు. మంగళవారం ఆరంభంలో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం వరకు అదే జోష్‌ను కనబరిచినప్పటికీ చివరికి నష్టాల్లో ముగిసాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు నిలకడగా సాగినప్పటికీ అమెరికా మాం ద్యంలోకి జారుకోవచ్చన్న వార్తలతో  దేశీయ ఇన్వెస్టర్లు చివరి గంటలో ఒక్కసారిగా అమ్మకాలకు దిగటమే నష్టాలకు ప్రధాన కారణం. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 810.98 పాయింట్లు నష్టపోయి 30579.09 పాయింట్లు, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 230.35 పాయింట్ల నష్టంతో 8967.05 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు మూడేళ్ల కనిష్ఠ స్థాయిల్లో ముగిసాయి. 2017 మార్చి తర్వాత నిఫ్టీ 9000 పాయింట్ల దిగువన ముగియటం ఇదే తొలిసారి. మరోవైపు గత రెండు రోజుల్లోనే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.9.74 లక్షల కోట్లు తుడిచి పెట్టుకు పోయింది. మార్కెట్‌ ఆరంభంలో ఇన్వెస్టర్లు విలువ ఆధారిత కొనుగోళ్లకు మొగ్గు చూపటంతో ప్రధమార్థంలో లాభాల్లో సాగాయని, అయితే చివరి గంటలో మాంద్య భయాలతో అమ్మకాలకు పాల్పడటంతో ఆరంభ లాభాలన్నీ హరించుకుపోయాయని మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు. 

Updated Date - 2020-03-18T06:27:06+05:30 IST