రెపో పెంచినా బ్రేక్‌ పడ లేదు..

ABN , First Publish Date - 2022-08-06T06:30:44+05:30 IST

ఆర్‌బీఐ రెపో రేటును మరో 0.50 శాతం మేరకు పెంచిందన్న వార్తలను కూడా ఈక్విటీ మార్కెట్లు ఏ మాత్రం పట్టించుకోలేదు.

రెపో పెంచినా బ్రేక్‌ పడ లేదు..

89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌


ఆర్‌బీఐ రెపో రేటును మరో 0.50 శాతం మేరకు పెంచిందన్న వార్తలను కూడా ఈక్విటీ మార్కెట్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతోనే ముగిశాయి. రోజంతా ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో చివరికి సెన్సెక్స్‌ 89.13 పాయింట్ల లాభంతో 58,387.93 వద్ద ముగియగా.. నిఫ్టీ 15.50 పాయింట్ల లాభంతో 17,397.50 పాయింట్ల వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 350.39 పాయింట్లు లాభపడి 58,649.19 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 817.68 పాయింట్లు, నిఫ్టీ 239.25 పాయింట్లు లాభపడ్డాయి. విదేశీ నిధుల రాక కొనసాగడంతో పాటు క్రూడాయిల్‌ ధరలు తగ్గడం మార్కెట్‌కు కలిసొచ్చింది. కాగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 16 పైసలు లాభపడి 79.24 వద్ద ముగిసింది.


Updated Date - 2022-08-06T06:30:44+05:30 IST