సెన్సెక్స్‌ @62,000

ABN , First Publish Date - 2021-10-20T08:04:56+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ తొలిసారిగా 62,000 మైలురాయిని దాటింది. ఇంట్రాడేలో 62,245.43 వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.

సెన్సెక్స్‌ @62,000

ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

లాభాల స్వీకరణతో చివరికి నష్టాల్లో ముగింపు

రూ.3.27 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరి  


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ తొలిసారిగా 62,000 మైలురాయిని దాటింది. ఇంట్రాడేలో 62,245.43 వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీ స్వల్ప నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో 7 రోజుల మార్కెట్‌ ర్యాలీకి తెరపడింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎస్‌ ఈ  సెన్సెక్స్‌ 49.54 పాయింట్ల నష్టంతో 61,716.05 వద్దకు జారుకుంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 18,604.45 వద్దకు ఎగిసినప్పటికీ.. చివరికి 58.30 పాయింట్ల నష్టంతో 18,418.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 14 లాభపడగా.. మిగ తా 16 నష్టాలు చవిచూశాయి. అన్నిటికంటే అధికంగా ఐటీసీ షేరు 6.23 శాతం క్షీణించింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 4.06 శాతం పతనం కాగా.. టైటాన్‌, టాటా స్టీల్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ షేర్లు 3 శాతానికి పైగా పడ్డాయి. టెక్‌ మహీంద్రా 4.12 శాతం ఎగిసి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఎల్‌ అండ్‌ టీ 3.26 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. 


రూ.271.42 లక్షల కోట్లకు మార్కెట్‌ క్యాప్‌ 

బీఎస్‌ఈలో రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, మెటల్‌ సూచీలు 4.56 శాతం వరకు క్షీణించగా.. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎనర్జీ, ఫైనాన్స్‌, బ్యాంకిం గ్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. బ్లూచి్‌పలతో పోల్చితే చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.98 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 1.79 శాతం పతనమయ్యాయి. అమ్మకాల హోరులో స్టాక్‌ మార్కెట్‌ సంపద రూ.3.27 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.271.42 లక్షల కోట్లకు పరిమితమైంది. 


పాలసీబజార్‌ రూ.6,017 కోట్ల ఐపీఓ 

పాలసీబజార్‌, పైసాబజార్‌ పోర్టళ్ల నిర్వహణ సంస్థ పీబీ ఫిన్‌టెక్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.6,017.50 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.3,750 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుండటంతోపాటు ప్రస్తుత వాటాదారులు, ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,267.50 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించాలనుకుంటోంది. 

Updated Date - 2021-10-20T08:04:56+05:30 IST