బ్యాంకింగ్ షేర్ల హవా.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ABN , First Publish Date - 2020-10-19T22:59:40+05:30 IST

బ్యాంకింగ్, ఫైనాన్సియల్ షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు పోటీపడడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ...

బ్యాంకింగ్ షేర్ల హవా.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్సియల్ షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు పోటీపడడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 449 పాయింట్ల మేర బలపడగా.. నిఫ్టీ సైతం 110 పాయింట్ల మేర లాభం నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడిన సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లలో జోష్ నింపిందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 448.62 పాయింట్లు  (1.12 శాతం) బలపడి 40431.60 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ  110.50 పాయింట్లు (0.94 శాతం) లాభపడి 11873 వద్ద క్లోజ్ అయ్యింది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, నెస్లే, ఎస్బీఐ, గెయిల్ తదితర షేర్లు ముందంజలో ఉండగా.. దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్స్ సిప్లా, బజాజ్ ఆటో తదితర షేర్లు వెనుకబడ్డాయి. 

Updated Date - 2020-10-19T22:59:40+05:30 IST