11300 వద్ద నిరోధం -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-09-28T06:30:35+05:30 IST

నిఫ్టీ గత వారం 11500 వద్ద నిలదొక్కుకోవటం లో విఫలమై కరెక్షన్‌లోకి జారుకుంది. గురువారం 11 వేల స్థాయిల దిగువకు పడిపోయినప్పటికీ శుక్రవారం బౌన్స్‌బ్యాక్‌ అయి మళ్లీ 11 వేల ఎగువకు చేరింది. వీక్లీ ప్రాతిపదికన మార్కెట్‌ 500 పాయింట్ల వరకు నష్టపోయింది...

11300 వద్ద నిరోధం  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం 11500 వద్ద నిలదొక్కుకోవటం లో విఫలమై కరెక్షన్‌లోకి జారుకుంది. గురువారం 11 వేల స్థాయిల దిగువకు పడిపోయినప్పటికీ శుక్రవారం బౌన్స్‌బ్యాక్‌ అయి మళ్లీ 11 వేల ఎగువకు చేరింది. వీక్లీ ప్రాతిపదికన మార్కెట్‌ 500 పాయింట్ల వరకు నష్టపోయింది. రికవరీ కనబరిచినప్పటికీ స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం కొద్ది రోజులు కన్సాలిడేట్‌ కావాల్సి ఉంటుంది. టెక్నికల్‌గా ట్రెండ్‌ పొజిషన్‌లో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన ట్రెండ్‌ ఇంకా డౌన్‌లోనే ఉంది. మైనర్‌ రికవరీ కోసం స్వల్పకాలిక నిరోధ స్థాయిలైన 11300 వద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌కు అవకాశాలుంటాయి. 


బుల్లిష్‌ స్థాయిలు: మైనర్‌ నిరోధ స్థాయిలైన 11160 ఎగువన నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌కి అవకాశం ఉంటుం ది. తదుపరి ప్రధాన నిరోధ, టార్గెట్‌ స్థాయిలు 11300. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. 

బేరిష్‌ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయి 11000 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. రక్షణ, సానుకూల ట్రెండ్‌ కోసం ఇక్కడ రికవరీ కావా ల్సి ఉంటుంది. మరింత బలహీనపడితే తదుపరి 10850 మరో ప్రధా న మద్దతు స్థాయిగా ఉంటుంది.  

బ్యాంక్‌ నిఫ్టీ: రికవరీ కనబరిస్తే తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 21500. తదుపరి అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. 

పాటర్న్‌: ప్రస్తుతం 11300 అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద గట్టి నిరోధాన్ని ఎదుర్కొంటోంది. అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ బ్రేకౌట్‌ సాధించటం తప్పనిసరి. 10850 వద్ద అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద ప్రధాన మద్దతు ఉంది. ఒకవేళ ఈ స్థాయికన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌కు అవకాశం ఉంటుంది. 

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 11110, 11160

మద్దతు : 10980, 10910


www.sundartrends.in

Updated Date - 2020-09-28T06:30:35+05:30 IST