వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు ఢమాల్!

ABN , First Publish Date - 2020-07-30T22:41:56+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలతో ముగిశాయి. లాభాల స్వీకరణతో బ్యాంకింగ్ స్టాక్‌కు అమ్మకాల...

వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు ఢమాల్!

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలతో ముగిశాయి. లాభాల స్వీకరణతో బ్యాంకింగ్ స్టాక్‌లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి. దీంతోపాటు యూరోపియన్ షేర్లు క్షీణించడంతో దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 335.08 పాయింట్లు (0.88 శాతం) నష్టంతో 37,736 వద్ద క్లోజ్ అయ్యింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం 100.70 పాయింట్లు (0.90 శాతం) క్షీణించి 11,102.15 వద్ద స్థిరపడింది. బీపీసీఎల్ అత్యధికంగా 7.65 శాతం మేర నష్టపోగా.. ఇండస్‌ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెడీఎఫ్‌సీ వరుసగా 5.61 శాతం, 3.41 శాతం, 3.61 శాతం మేర నష్టపోయాయి. వీటితో పాటు బజాజ్ ఫైన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ కార్ప్, ఎస్బీఐ, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, గెయిల్ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అత్యధికంగా 5.02 శాతం మేర లాభపడగా... సన్ ఫార్మా 3.43 శాతం, విప్రో 3.54 శాతం లాభాలను నమోదు చేశాయి. మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, సిప్లా, యూపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు కూడా ముందంజలో ఉన్నాయి. 

Updated Date - 2020-07-30T22:41:56+05:30 IST