కొత్త ఆర్ధిక సంవత్సరం తొలిరోజే దేశీయ మార్కెట్లు భారీగా పతనం

ABN , First Publish Date - 2020-04-01T22:22:17+05:30 IST

ముంబై: 2020-21 కొత్త ఆర్ధిక సంవత్సరం తొలిరోజే దేశవాళీ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ..

కొత్త ఆర్ధిక సంవత్సరం తొలిరోజే దేశీయ మార్కెట్లు భారీగా పతనం

ముంబై: 2020-21 కొత్త ఆర్ధిక సంవత్సరం తొలిరోజే దేశవాళీ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా పతనం కాగా..  ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం 4 శాతం మేర నష్టం చవిచూసింది. రోజు రోజుకూ పెరగుతున్న కరోనా వైరస్ కేసులు.. దేశంలోనూ, దేశం వెలుపలా ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై నెలకొన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1203 పాయింట్లు (4.08 శాతం) మేర నష్టపోయి 28,265 వద్ద క్లోజ్ అయ్యింది. నిప్టీ 344 పాయింట్లు నష్టపోయి 8,254 వద్ద ముగిసింది.


దాదాపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలోని అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ ఐటీ 5.4 శాతం, ప్రయివేట్ బ్యాంకు 4.8, ఫైనాన్సియల్ సర్వీస్ 3.9 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 3.5 శాతం మేర పతనమయ్యాయి. కాగా ప్రయివేటు బ్యాంకులు కొటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు వరుసగా 8.6 శాతం, 6.2 శాతం నష్టపోగా... ఎస్‌బీఐ కూడా 5 శాతం మేర నష్టపోయింది. ఐటీ దిగ్గజాల్లో టెక్ మహీంద్రా 9.4 శాతం, టీసీఎస్ 6.1 శాతం, ఇన్ఫోసిస్ 5.8 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 4.9 శాతం డౌన్ అయ్యాయి. 

Updated Date - 2020-04-01T22:22:17+05:30 IST