వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN , First Publish Date - 2021-02-25T21:46:05+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడో రోజుల లాభాలతో ముగిశాయి. మెటల్, ఇంధన స్టాక్‌ల జోరుతో సెన్సెక్స్ 257 పాయింట్లు బలపడగా..

వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. మెటల్, ఇంధన స్టాక్‌ల జోరుతో సెన్సెక్స్ 257 పాయింట్లు బలపడగా.. నిఫ్టీ సైతం 15,100 మార్కునకు ఎగువన నమోదైంది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 257.62 పాయింట్లు (0.51 శాతం) లాభంతో  51,039.31 వద్ద స్థిరపడగా.. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 115.40 పాయింట్లు (0.77 శాతం) బలపడి 15,097.40 వద్ద క్లోజ్ అయ్యింది. కోల్ ఇండియా, యూపీఎల్, ఆదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, బీపీసీఎల్ తదితర షేర్లు లాభాలు నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే, ఎల్‌ అండ్ టీ, దివీస్ ల్యాబ్స్, టైటాన్ తదితర షేర్లు నీరసించాయి. 

Updated Date - 2021-02-25T21:46:05+05:30 IST